ఆర్యవైశ్య సంఘాల బొడ్డు శ్రీధర్‌ అధ్యక్షతన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ

రాజేంద్రనగర్‌ ప్రజాబలం ప్రతినిది: మణికొండలోనీ వివిధ ఆర్యవైశ్య సంఘాలు సంఘటితంగా ఎర్రం శ్రీనివాస్‌ ఇంట్లో ఒక చోట చేరి బొడ్డు శ్రీధర్‌ అధ్యక్షతన జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడి మొట్ట మొదటి కోర్‌ కమిటీ మీటింగ్‌ నిర్వహించడం జరిగినది. ఈ కోర్‌ కమిటీ నిర్ణయం మేరకు మణికొండలోనీ వివిధ రాజకీయ పక్ష నేతలను కలుపుకొని వాసవి మాత అమ్మవారి గుడి కట్టాలని, అందుకోసం అందరి సహాయ సహకారాలతో మణికొండలో తగిన స్థలాన్వేషణ చేయాలని నిర్ణయించడం జరిగింది, ఇట్టి సమావేశంలో పాల్గొన్న ముఖ్యులలో సముద్రాల రమేష్‌, శ్రీహరి, బద్రీనాథ్‌, నాగరాజు, రత్నం, ప్రవీణ్‌, సాయిరాం, సురేష్‌, కృష్ణ, శివ ప్రసాద్‌, వేణు, స్రవంతి, సమంత, లాస్య,రక్షిత,మాధవి తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking