ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యం”

 

వరంగల్ ప్రజాబలం మార్చి11

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖేడే, సంధ్యా రాణి ల తో కలిసి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సంబందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం (86 ) దరఖాస్తులు రాగా (56) రెవెన్యూ , ( 30 ) ఇతర శాఖ కు చెందినవి ఉన్నాయని. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు పరిష్కరణ నిమిత్తం సిఫారసు చేశారు.
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు చేరేవిధంగా జిల్లా అధికారులు చొరవ చూపాలని, ప్రజలనుండి వారం వారం స్వీకరించిన ధరకాస్తులలో పరిష్కరించేందుకు వీలుకానీ పక్షంలో దరఖాస్తుదారునకు అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ ప్రజావాణి పోర్టల్ లో పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సంబందిత శాఖల జిల్లా అధికారులను సూచించారు.

ప్రజావాణిలో నర్సంపేట ఆర్డీవో కృష్ణ వేణి, జిల్లా పరిషత్ సిఇవో రాం రెడ్డి , అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking