క్రీడలతో మానసిక ఉల్లాసం
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 5
జమ్మికుంట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్నూకర్ పాయింట్ ను వోడితల ప్రణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలకే పరిమితమైనటు వంటి స్నూకర్ పాయింట్ గేమ్ గ్రామీణ ప్రాంతాలలో సైతం ఏర్పాటు చేయడం అభినందనీయమని, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చాలామంది యువకులు ఈ క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పోనగంటి మల్లయ్య, బొంగోని వీరన్న నాయకులు సుంకరి రమేష్,మొలుగూరి సదానందం,సతీష్ రెడ్డి, సలీం, పర్లపల్లి నాగరాజు, తోపాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.