కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి అధ్యక్షతన సన్నాహక సమావేశం
ప్రజాబలం ప్రతినిధి
తేది.13.3.2025.
ములుగు జిల్లా.
గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి అధ్యక్షతన యాసంగి 2024 – 25 కాలము
సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కాంట తార్పొలిన్, మంచినీరు ప్రతి కొనుగోలు కేంద్రం
నందు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ కూడా అందుబాటులో ఉండవలసిందిగా సంబంధిత శాఖ అధికారులకు మరియు స్టేట్ హోల్డర్స్ కు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రంలో సదుపాయాలను కల్పించవలసిందిగా ఆదేశించినారు. FAQ ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి మిల్లు ట్యాగ్ చేయబడిన రైస్ మిల్లు పంపవలసిందిగా ఆదేశించారు.
ఇందులో వరి కొనుగోలు సేకరణలో భాగస్వాములైన, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు,
జిల్లా పౌర సరఫరాధికారి,
జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ ములుగు, డిస్టిక్ట్ కోపరేటివ్ ఆఫీసర్, డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్, మేనేజర్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్, హార్టికల్చర్ ఆఫీసర్, డిస్టిక్ మార్కెటింగ్ ఆఫీసర్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎఫ్ సి ఐ మేనేజర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు ప్రతినిధులు హాజరయ్యారు.