పది పరీక్షలకు ఆత్మస్థైర్యంతో సిద్ధం కండి జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఆత్మస్థైర్యంతో సిద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం ముధోల్, బాసరలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడంలో భాగంగా పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతున్న సమయంలో వివిధ విషయాలకు సంబంధించిన సమస్యలను విషయ ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఇప్పటికే విద్యార్థులకు స్లిప్ టెస్టులు నిర్వహించడం జరిగిందని వివరించారు. అదేవిధంగా వార్షిక పరీక్షలకు ముందు నిర్వహించే ప్రీఫైనల్ పరీక్షలను సైతం బాగా రాయాలని సూచించారు. వార్షిక పరీక్షలు 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సైతం విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం మన ఊరు- మనబడి పనులను సైతం పరిశీలించి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జి. మైసాజి, ప్రధానోపాధ్యాయులు, తదితరులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking