హాయ్ సే హత్ జోడో యాత్రకు మద్దతుగా మాజీ మంత్రి గడ్డం వినోద్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 11 : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్రలో చేస్తున్న హత్ సే హాత్ జోడో కార్యక్రమానికి మద్దతుగ శుక్రవారం కాసిపేట్ మండల కేంద్రంలో మాజీ మంత్రి వర్యులు గడ్డం వినోద్,నాయకత్వం లో మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలోహత్ సే హత్ జోడో కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ఈ సందర్భంగా మాజీ మంత్రి గడ్డం వినోద్ మాట్లాడుతూ.. కాసిపేట్ మండల్ లో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెండా ఎగరవేసి యాత్ర ప్రారంభించి మండలం లోని వ్యాపార సముదయాలు అన్ని తిరిగి రానున్న రోజుల్లో భారీ మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రైతులకి 2 లక్షల రుణమాఫీ,ధరణి పోర్టల్ రద్దు గ్యాస్,విద్యుత్ ధరలు ప్రజలకి అందుబాటులోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని కోరడం జరిగింది,అనంతరం జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ మాట్లాడుతు…. రానున్న ఎన్నికల్లో బెల్లంపల్లి గడ్డం వినోద్ ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ని రాష్ట్రం లో అధికారంలోకి తీసుకురావాలి చెన్నూర్ లో జైపూర్ పవర్ ప్లాంట్ ని తీసుకొచ్చిన ఘనత గడ్డం వినోద్ గారిదే అని బెల్లంపల్లి లో కూడా అభివృద్ధి గడ్డం వినోద్ తోనే సాధ్యం అన్నారు,ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు,బన్న ఆశాలు,గుండా రాజు కుమార్,సల్లూరి సమీల్,దుర్గం ప్రవీణ్,బోర్లకుంట ప్రణయ్,షైక్ షారుఖ్,సురేష్,నైతం పద్మ,బన్న రవి రాజా,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking