అంబర్పేట్‌ ఎమ్మార్వో మీరాబాయి ని కలిసి వినతి పత్రం ఇచ్చిన

శంభుల ఉషశ్రీ శ్రీకాంత్‌ గౌడ్‌.
అంబర్‌పేట్‌ ప్రజాబలం ప్రతినిధి మార్చి 20:రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్‌ రెడ్డి యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు. దీనికి క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ మరియు ఇన్కమ్‌ సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంది అందుకుగాను ఎవరైతే ఈ యువ వికాసం పథకాన్ని గురించి ఇన్కమ్‌ మరియు క్యాస్ట్‌ సర్టిఫికెట్లను కోరుతూ అప్లై చేస్తారో వారికి ఒకరోజు సమయంలో వాటిని సాంక్షన్‌ చేయాల్సిందిగా కోరుతూ అంబర్పేట్‌ ఎమ్మారో మీరాబాయిని కలిసి వినతి పత్రాన్ని టిపిసిసి సెక్రటరీ శంభుల శ్రీకాంత్‌ గౌడ్‌ లతో కలిసి అందించిన బాగ్‌ అంబర్పేట్‌ డివిజన్‌ కంటెస్టెడ్‌ కార్పొరేటర్‌ శంభుల ఉషశ్రీ శ్రీకాంత్‌ గౌడ్‌. ఎమ్మార్వో మీరాబాయి వెంటనే స్పందించి ఎవరైతే ఆన్లైన్‌ లో అప్లై చేస్తారో వారు ఆ ఫైల్‌ ని తనకి స్వయంగా ఇస్తే ఒక్కరోజు సమయంలో సాంక్షన్‌ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శంభుల ఉషశ్రీ శ్రీకాంత్‌ గౌడ్‌ మాట్లాడుతూ ముందుగా ఎమ్మార్వో మీరాబాయి కి ధన్యవాదాలు తెలియజేశారు. నిరుద్యోగ యువత కు ఈ యొక్క యువవికాసం పథకంలో 50 వేల నుండి 4 లక్షల వరకు లోన్‌ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 60 శాతం నుండి 80 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. దీనిలో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలు అప్లై చేసుకునే వీలుంది సామాన్య ప్రజలు కూడా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ముందుకు సాగుతుంది మా కాంగ్రెస్‌ ప్రభుత్వం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ రాజ్‌ కిరణ్‌ మహేందర్‌ అనిల్‌ శ్యామ్‌ శివ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking