ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 8 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక వెంకటేశ్వర నగర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డయాగ్నోస్టిక్ హబ్ కి రోగుల నుండి పరీక్షల నిమిత్తం సేకరిస్తున్న రోజువారి శాంపిల్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్సిడి రిజిస్టర్ పరిశీలించి, ఎంత మందికి ఏ ఏ రకాల మందులు ఇస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ఇడిడి వివరాలు కేంద్రంలో ప్రదర్శించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని అన్నారు. కుక్క, పాము కాటు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఇంచార్జ్ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. రాములు నాయక్, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.