ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించి ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలు చెల్లించాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని శనివారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని మాట్లాడిన కేసీఆర్ ఆశా కార్యకర్తలను ఎందుకు పర్మినెంట్ చేయడం లేదని ప్రశ్నించారు. కరోనా సమయంలో జీవితాన్ని పణంగా పెట్టి వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. వెంటేనే వారికి ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాగానే ఆశా కార్యకర్తలను రెగ్యులర్ చేస్తామని అన్నారు.