మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి (ప్రజాబలం)7 అక్టోబర్:
ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులకు ఎన్నికల శిక్షణ తరగతులు నిర్వహించనున్నందున సోమవారం జరిగే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు దూర ప్రాంతాల నుంచి అవస్తలు పడి ప్రజావాణికి తరలి రావద్దని… అధికారులకు ఎన్నికల శిక్షణ తరగతులు ఉన్నందున ప్రజలు సహకరించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ కోరారు.