జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి టీయుడబ్ల్యూజే (ఐజెయు)

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని టియుడబ్ల్యూజే (ఐజెయు) అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కొండూరి రవీందర్, వెంకగారి భూమయ్యలు కోరారు. శనివారం రోజున జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్డీవో కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్ మాట్లాడుతూ స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పందించి, జర్నలిస్టులకు ఎన్నికల కోడ్ కు ముందుగానే ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరారు. జర్నలిస్టులకు మద్దతుగా ఆయా పార్టీల కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు, బిజెపి నాయకులు రావుల రామనాథ్, జేఏసీ నాయకులు విజయ్ కుమార్, సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు గుమ్ముల అశోక్, దాసరి వేణు, కోశాధికారి ప్రశాంత్,సహ కార్యదర్శి, జల్ద మనోజ్ సట్ల హనుమండ్లు. , భోజ రెడ్డి, ఉస్మాన్ , రాజేశ్వర్, సభ్యులు పులి రమేష్, భాను, నరసయ్య, మల్లేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking