సంగారెడ్డి పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని, సంగారెడి టౌన్ పోలీసు స్టేషన్ నందు “చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్” ప్రారంభించిన డి.జి.పి
రాష్ట్రంలో మొదటి సారిగా సంగారెడ్డి టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రము.
…..తెలంగాణ రాష్ట్ర డి.జి.పి శ్రీ అంజనీ కుమార్ ఐ.పి.యస్.,
….అడిషనల్.డి.జి.పి. శ్రీమతి శిఖాగోయల్ ఐ.పి.యస్
సంగారెడ్డి అక్టోబర్ 7 ప్రజ బలం ప్రతినిధి:
పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని, సంగారెడి టౌన్ పోలీసు స్టేషన్ నందు “చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్”ను ప్రారంభించిన డి.జి.పి శ్రీ అంజనీ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్” అనేది మైనర్ బాలబాలికలచే పోలీసు స్టేషన్ కు వచ్చే వారి సహాయార్థం, బాల నేరస్తులు పోలీసు స్టేషన్ కు వచ్చినప్పుడు వారికి మంచి వాతావరణాన్ని అలవరచాలనే ఉద్యేశంతో ఈ చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ను రాష్ట్రంలో మొదటి సారిగా సంగారెడ్డి టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో జిల్లా లో అన్ని పోలీస్ స్టేషన్ లలో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ లో పిల్లలు పోలీసు స్టేషన్ కు వచ్చామనే భావన కలగకుండా బొమ్మలతో, ఆట వస్తువులతో ఆడుకొనే విధంగా అహ్లాదకరమైన వాతావారం ఉంటుందన్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ పోలీసు అధికారి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి, వారి పిల్లల రక్షణ చట్టం-2015 నిర్ధేశించిన విధంగా సేవలను/ ప్రక్రియలను అందించడంలో ఎల్లవేళలా వారికి చేదోడు వాదోడుగా ఉంటారని వివరించారు. అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన చైల్డ్ ఫ్రెండ్లీ అధికారుల వివరాలను అంతటా పొందుపరచడం జరుగుతుందన్నారు.
అనంతరం భరోసా కేంద్రాన్ని ఉద్యేశించి మాట్లాడుతూ.. మహిళ భద్రతకు భరోసనిస్తూ, బాధిత మహిళలను, పిల్లలను హక్కున చేర్చుకొని, కొండంత ధైర్యానిస్తూ, భరోసా సెంటర్ ద్వారా మహిళల, పిల్లల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. 2016 లో హైదరాబాద్ లో ప్రారంభమైన భరోసా సెంటర్ సేవలు దేశానికే ఆదర్శం అని, సంగారెడ్డి జిల్లాలో కూడా శాశ్వత భరోసా సెంటర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. భరోసా సెంటర్ సేవలను గౌరవ సుప్రీం కోర్ట్ నిపుణ్ సక్సేనా వర్సెస్ UOI లో కొనియాడి, ఇలాంటి భరోసా సెంటర్లను దేశమంతా ప్రారంభించాలని అధేశించారు. భరోసా సెంటర్ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పోక్సో మరియు అత్యాచార కేసులలో కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు, మెడికో లీగల్ సర్వీస్ లు అందించడం, CWC ద్వారా భాదిత మహిళలకు షెల్టర్ కల్పించడంతో పాటు భాదితులకు నష్ట పరిహారం ఇప్పించడం జరుగుతుందన్నారు. పోలీసు స్టేషన్లో కేసు నమోదు మొదలుకొని, చివరివరకు అన్ని తానై వెన్నంటి వుంటూ బాధిత మహిళలకు అండగా నిలుస్తున్నారు అన్నారు. ఈ చట్టాలన్నీ పోక్సో చట్టం మరియు పిల్లల చట్టాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతర తెలంగాణ పోలీసులో అనేక సంస్కరణలు వచ్చాయని, తెలంగాణ పోలీసు దేశానికే ఆదర్శం అన్నారు.
అనంతరం మహిళా భద్రత విభాగం అడిషనల్. డి.జి.పి. శిఖాగోయల్ ఐ.పి.యస్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. షీ-టీమ్స్ బృందాలు స్కూల్స్, కళాశాలలో ఈవ్ టీసింగ్, విమెన్ ట్రాఫీకింగ్, బిక్షాటన చేయించడం, డయల్-100, సైబర్ క్రైమ్స్ పై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, యువతను చైతన్య పరచడం జరుగుతుంది. షీ-టీమ్స్ బృందాలు నిరంతరం నిఘా వేస్తూ, బస్ స్టాండ్స్, జనాలు ఎక్కువ రద్దీగా ఉండే, పని ప్రదేశాలలో ఆకతాయిలు ఎవరైనా ఈవ్ టీసింగ్ కు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహిళలు ఎవరైన ఈవ్ టీసింగ్ కు గురైన లేదా ఎలాంటి ఆపద సమయంలోనైనా జిల్లా షి-టీం నెంబర్ 8712656772 కు ఫోన్ చేసి గాని వాట్సాప్ ద్వారా గాని సమాచారం అందించాలన్నారు.
భరోసా సెంటర్ ప్రారంభమైన నాటినుండి అందించిన సేవలు:
• పోక్సో-251, రేప్-18, ఇతర-58, మొత్తం=327 కేసులలో కౌన్సిలింగ్ నిర్వహించడం, వాగ్మూలం వ్రాయడం, 164 Cr.P.C, ప్రకటనలు వ్రాయడం, మెడికల్ సర్వీసు అందించడం, బాధితులకు రూ: 83,50,000/-, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అతారిటీ నుండి తక్షణ పరిహారంగా రూ: 100,000/-, బాదితులకు తక్షణ పరిహారం భరోసా నుండి రూ: 85,000/-, మొత్తం 198 మందికి నష్ట పరిహారం ప్రభుత్వం నుండి ఇప్పించడం జరిగింది.
• ఫోక్సో కేసులు-251,
• రేప్ కేసులు -18,
• ఇతర కేసులు- 58,
• మొత్తం 327 మంది బాధితులకు భరోసా కల్పించడం జరిగింది.
• భరోసా సెంటర్ సిబ్బంది 114 మంది బాధితుల ఇండ్లను సందర్శించడం జరిగింది,
• 13 మందిని రియాబిటేషన్ సెంటర్ కు పంపించడం జరిగింది.
• గ్రామాలలో పట్టణాలలో భరోసా సెంటర్ అందిస్తున్న సేవల గురించి 75 అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ప్రాసిక్యూషన్ సమయంలో కూడా బాధితులకు న్యాయపరమైన సలహాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కేసులు నమోదవుతున్న పోలీస్ స్టేషన్ల నుండి సంబంధిత కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు ఎలాంటి జాప్యం లేకుండా భరోసా సెంటర్ కు పంపించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యండ్లూమ్స్ చైర్మెన్ చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ శరత్ ఐ.ఎ.యస్., జిల్లా ఎస్పీ శ్రీ. యం.రమణ కుమార్ , అదనపు ఎస్పీ. డా. పి. అశోక్, డీ.టీ.సీ. అదనపు ఎస్పీ రాములు నాయక్, ఐ.ఎస్. ఆర్ రావు ఎస్.ఆర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ కార్పొరేట్ అఫైర్స్ అరబిందో ఫార్మర్ లిమిటెడ్, జి.వి.జి. మూర్తి హెడ్ పబ్లిక్ రిలేషన్స్ అరబిందో ఫార్మా లిమిటెడ్, సంగారెడ్డి డి.ఎస్.పి రమేష్ కుమార్, పటాన్చెరు డిఎస్పి పురుషోత్తం, నారాయణఖేడ్ డి.ఎస్.పి వెంకట్ రెడ్డి, ఏ.ఆర్.డి.ఎస్.పి జనార్ధన్, యస్.బి. ఇన్స్పెక్టర్ శివలింగం, విమెన్ పి.ఎస్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, సంగారెడ్డి టౌన్ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సంగారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ సుధీర్ బాబు, భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
