జాంబాగ్‌లో ప్రోఫెసర్‌ జయశంకర్‌ బడిబాట

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రోఫెసర్‌ జయశంకర్‌ బడిబాట గవర్నమెంట్‌ బాయ్స్‌ హైస్కూల్‌ సూల్తాన్‌బజార్‌ (నాంపల్లి మండలంలో ) గ్రామ సభ మరియు సర్వే లో భాగంగా గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి నియోజకవర్గం జాంబాగ్‌ డివిజన్‌ పుసలబస్తీ ,సిక్‌గల్లీ ,జాంబాగ్‌ ,పుత్లీబౌలీ ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ తమ స్కూల్లో అడ్మిషన్‌ తీసుకోవాలని కోరుతూ గత అకాడమిక్‌ ఇయర్‌ లోస్కూల్‌ రిజల్ట్‌ మరియు సౌకార్యాలు వివరిస్తూ ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా తమ స్కూల్‌ వివరాలను తెలియజేస్తూ తమ స్కూల్లో పిల్లలను చేర్పించాలనికోరడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు మాధురి,స్కూల్‌ టీచర్లు హెలెన్‌,సుమిత్ర,శ్రీదేవి ,సిబ్బంది గోషామహల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చంద్రమోహన్‌ యాదవ్‌ , ఆర్‌.వి.వినోద్‌ కూమార్‌ ఎస్‌ .ధన్‌రాజ్‌ ,సుబాష్‌ (లడ్డూ),నర్సింగ్‌ రావ్‌, శేఖర్‌ ,సంజీవ్‌,రోజి,మరియు స్థానిక బస్తీ సంఘాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking