టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
షాద్ నగర్ ప్రజాబలం ప్రతినిధి:షాద్ నగర్ లో జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం
ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం..
భారీ గజమాలతో పీసీసీ కి స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు
స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఈడెన్ గార్డెన్ వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ
అనంతరం ఈడెన్ గార్డెన్ లో నిర్వహించనున్న సభలో పాల్గొననున్న టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ
పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారు
రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది
మనుస్మృతిని అమలు చేయాలని బీజేపీ నేతల కుటిల ప్రయత్నం
రాజ్యాంగం పరిరక్షణే ధ్యేయంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు
దేశ సమగ్రతకు, అఖండతకు తూట్లు పొడిచే విధంగా ప్రధాని , అమిత్ షా వ్యవహరిస్తున్నారు
అధికారమే పరమావధిగా ..అధికారం లేకుంటే బతకలేమనే విధంగా బీజేపీ నేతల తీరు
రాజకీయ స్వలాభం కోసం బీజేపీ నేతలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్చినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
దేశ విచ్ఛిన్న శక్తుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఖర్గే, సోనియా గాంధీ , రాహుల్ గాంధీ పిలుపు మేరకు గల్లి నుంచి ఢల్లీి వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం
పదేళ్లు అధికారంలో ఉండి కూడా చేసిన అభివృద్ది చెప్పుకోలేని స్థితిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది

400 సీట్లు వస్తాయని నమ్మ బలికిన బీజేపీ నేతలకు ప్రజలు తగిన రీతిలో బుద్ద్ది చెప్పారు..అయిన వారిలో మార్పు రాలేదు
రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తో దేశాన్ని భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా అర్థం చేసుకోగలిగారు
దేశంలో అసమానతలు,ఆర్ధిక వ్యత్యాసం రూపుమాపేందుకు రాహుల్ గాంధీ కుల సర్వేకు శ్రీకారం చుట్టారు
రాహుల్ గాంధీ ఆశయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి కుల సర్వే పూర్తి చేసి ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారో తేల్చిచెప్పారు
ఖర్గే , రాహుల్ గాంధీ సూచన మేరకు ఒక బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీలకు కేబినెట్ లో పదవులు కట్టబెట్టాం
పిసిసి కార్యవర్గంలో సైతం 70 శాతం మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి చోటు కల్పించి.. సామాజిక న్యాయానికి , మహిళలకు పెద్దపీట వేశాం
ప్రధాని పాకిస్థాన్ పై యుద్ధం అని ప్రగల్భాలు పలికి ట్రంప్ చెప్పగానే తోక ముడిచారు
92 వేల సైనికులను ముక్కును నేలరాపించిన చరిత్ర అపర ఖాళీ మాత ఇందిరా గాంధీ ది
ప్రధాని పదవిపై మోదీ కి యావ తప్ప..దేశంపై ప్రేమ లేదు
పాకిస్థాన్ పై యుద్ధంలో దేశం సాధించింది ఏంటి? కోల్పోయింది ఏంటి? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది