అనుమతి లేని డ్రోన్,డి జే సౌండ్స్ పై చర్యలు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 01 : సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల,పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్,ఐపీఎస్(ఐజి)ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలపడం జరిగింది.మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం,అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమిoచిoదని,మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంలో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ నిషేధాజ్ఞలు 01-04-2024 నుండి 01-05-2024 వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు. ఐపిసీ188,హైదరాబాద్ నగర పోలీసు చట్టం,ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.