పవిత్ర రంజాన్ మాసం పుణ్యాల మాసం

నిరుపేద ముస్లింలకు రంజాన్ కీట్స్ పంపిణీ

స్వర్గీయ మహమ్మద్ ఇబ్రహీమ్ జ్ఞాపకార్థంగా వారీ తనయులు గల్ఫ్ ఎన్.అర్.ఐ. అధ్వర్యంలో

ఖమ్మం ప్రతినిధి మార్చి 31 (ప్రజాబలం) ఖమ్మం పవిత్ర రంజాన్ మాసం ఎంతో పుణ్యాల మాసమని గల్ఫ్ ఎన్నారై మహమ్మద్ యూసుఫ్ సాహెబ్, మహమ్మద్ యాసిన్ లు ఒక ప్రకటనలోతెలిపారు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో అర్హులైన 45 మంది నిరుపేద ముస్లింలకు స్వర్గీయ మహమ్మద్ ఇబ్రహిమ్ జ్ఞాపకార్థంగా వారీ తనయుల పరోక్ష ఆధ్వర్యంలో రంజాన్ కీట్స్ పంపిణీ చేశారు ఈసందర్భంగా జిల్లా పరిషత్ మాజీ ఉద్యోగి స్వర్గీయ ఇబ్రహీం తనయులు మాట్లాడారు రంజాన్ మాసంలో జకాత్ ఫిత్రా రూపంలో దానధర్మాలు చేసే ప్రత్యేక మాసమని అందుకే ఈ రంజాన్ మాసాన్ని ఈద్-ఉల్-ఫితర్ అంటారన్నారు నిరుపేద ముస్లింలకు రంజాన్ పర్వదినోత్సవం రోజున సేమియా మరియు భోజన సదుపాయాలకు సంబంధించిన నిత్యావసరాల వస్తువులతో పాటు బియ్యం, సేమియా, డ్రై ఫ్రూట్స్. పంచదార, ఆనియన్స్ డాల్డా, రిఫైండ్ ఆయిల్, వెయ్యి రూపాయల విలువ గల ఒక్కో కిట్ పండుగ సామాగ్రిని 45 మంది నిరుపేద ముస్లిం మహిళలకు అందించడం తన అదృష్టంగా భావిస్తున్నా మన్నారు ఇకనుంచి ప్రతి రంజాన్ పర్వ దినోత్సవం రోజున నిరుపేద ముస్లింలకు తమవంతుగా ఆర్థిక సహాయ సహకారాలు ఈపండుగ రూపంలో అందిస్తామన్నారు ఈకార్యక్రమoలో తమను భాగస్వామ్యం చేసిన జర్నలిస్ట్ జానీపాషాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు అనంతరం కిట్స్ అందుకున్న నిరుపేద ముస్లింలు దువా చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking