ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 24 (ప్రజాబలం) ఖమ్మం ఐడిఓసి సమావేశ మందిరంలో పలు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అర్జీదారులనుండి స్వీకరించి తగు చర్య నిమిత్తం ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు తల్లాడ మండలం బస్వాపురం గ్రామంకు చెందిన శీలం బసవేశ్వరి తనకు వచ్చే వితంతు ఫించను నిలుపుదల చేయడం జరిగినది అట్టి ఫించను పునరుద్ధరించగలరని సమర్పించిన దరఖాస్తును, మధిర మండలం రొంపిమళ్ళ గ్రామంకు చెందిన తడికమళ్ళ అచ్చారావు తనకు వచ్చే వృధ్దాప్య పించను నిలుపుదల చేయడం జరిగినదని, పించను పునరుద్దరించగలరని సమర్పించన దరఖాస్తును, మధిర మండలం మల్లారం గ్రామంకు చెందిన కంచర్ల సత్యనారాయణచారీ తనకు 56 సంవత్సరముల వ్యయస్సులో కూలీ పనిచేసుకొని జీవనం కొనసాగిస్తున్నానని తాను షుగర్ వ్యాధితో బాదపడుతున్నానని తనకు ఆసరా పించను మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును, నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంకు చెందిన పిల్లుట్ట కొండయ్య తను వికలాంగుడినని, తనకు వచ్చే వికలాంగుల పింఛను రావడం లేదని అట్టి ఫించను పునరుద్ధరించగలరని సమర్పించిన దరఖాస్తులను పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించినారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గోపాలపురంకు చెందిన వికలాంగుడు దేవసాని మురళి తనకు మూడు చక్రముల మోటారు వాహనం ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును జిల్లా సంక్షేమ శాఖ అధికారికి తగు చర్యనిమిత్తం సూచించారు. తల్లాడ గ్రామ పంచాయితీ 3 వ వార్డు మల్లారం రోడ్ బాలబారతి స్కూల్ ఏరియా వాసులు తమ నివాసాల వద్ద చేపల దుకాణం, చికెన్ షాపుల వ్యవర్థాలు వేయడం వల్లన దుర్వాసనతో అపరిశుభ్రవాతావరణంతో ఇబ్బందులకు గురికావడం జరుగుచున్నదని, డ్రైౖనేజ్ వ్యవస్థను మెరుగుపర్చి చెత్తకుండీలను ఏర్పాటు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం జిల్లా పంచాయితీ అధికారికి సూచించినారు. చింతకాని మండలం నాగులవంచ గ్రామంకు చెందిన బిళ్ళకంటి సైదులు తన స్వార్జితం అయిన ఇంటి స్థలం ఇద్దరు కుమారులు, కుమార్తెలకు పంచగా తన పేరున 65 గజముల స్థలం ఉంచుకోవడం జరిగినదని, అట్టి స్థలంలో తాను ఇళ్లు నిర్మించుకొనుటకు తన కుమారులు అంగీకరించుట లేదని తాను పక్షవాతంతో ఇబ్బందులు పడుతున్నాని కుమారులు పోషణ సైతం పట్టించుకోవటం లేదని తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం విచారణ చేసి తగు చర్యలకై రెవెన్యూ డివిజనల్ అధికారికి సూచిండమైనది. కొణిజర్ల మండలం కొణిజర్లకు చెందిన దొడ్డ వెంకటేశ్వర్లు తమ తల్లిగారు దొడ్డ సశిరేఖ పేరున సర్వేనెం.96.ఏలో 1.11 కుంటలు, 96 బి.లో 20 కుంటలు, 279 ఏలో 3.35 కుంటలు మేరక, 279 బిలో6.20 కుంటలు మేరక కలదని అట్టి భూమిని ఇద్దరు అన్న తమ్ములు సరిసమానంగా పంచుకోవడం జరిగినదని, అట్టి భూమిని కొంత మంది ఆక్రమించుకోవడం జరిగినదని సర్వేచేయించి తమకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం సర్వేల్యాండ్ ఏ.డికి సూచించడమైనది.గ్రీవెన్స్ డే లో ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంధ్రనాద్, జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.శ్రీరామ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.