జమ్మికుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల నిరసన.

తూతూ మంత్రంగా సర్వసభ సమావేశం.

జమ్మికుంట మున్సిపల్ లో నిర్వహించిన సర్వ సభ్య లోని ఎజండాలో అవినీతి.

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చి 01

జమ్మికుంట మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ప్రవేశ పెట్టిన ఎజండ ప్రజల అభివృద్ది కోసం ఉపయోగ పడేలా లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం 12 గంటలకు వుందని సమాచారం అందించి ఆ తరువాత 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు మళ్ళీ సమాచారం అందించారని తెలిపారు. ఈ సమాచారం తో 11:30 కు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ గదిలోకి వెళ్ళగానే సమావేశం ముగిసిందని చైర్మెన్ ,కమిషనర్ వెళ్లిపోయారని అవేదన వ్యక్తం చేశారు.అవినీతిని బట్టబయలు చేస్తారనే భయంతో కాంగ్రెస్ కౌన్సిలర్లను సమావేశంకు ఆలస్యంగా వచ్చేలా సమావేశ సమయంతో మార్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజండా లో పొందుపరచిన అంశాలు ప్రజలు పట్టణ అబివృద్దికి పనికి వచ్చేలా లేవని, ఛైర్మన్ జేబులు నింపుకునెలా ఉన్నాయని ఆరోపించారు. దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి జమ్మికుంట మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking