.. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి.
హైదరాబాద్ ప్రజా బలం మార్చ్ 1 న్యూస్ :-
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా కే.శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపధ్యంలో శుభాకాంక్షలు తెలియజేసిన టియుడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ,టియుడబ్ల్యూజే సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కలకుంట్ల రంగాచారి,టియుడబ్ల్యూజే. ఉమ్మడి మెదక్ జిల్లా హెల్త్ కమిటీ మెంబర్. మెంగర్తి సుధాకర్. సిద్దిపేట జిల్లా నాయకులు సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు,మధుకర్, ఈ కార్యక్రమం హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకు జర్నలిస్టుల సమస్యల గురించి ఎంతోమంది యూనియన్ నాయకులు అకాడమీ చైర్మన్ పోరాడారు కానీ అందరి భాగస్వామ్యంతో,పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా మీడియా అకాడమీ చైర్మన్ అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోయారు నిధులు కూడా 100 కోట్లు కేటాయించి 42 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.ఇక గత ప్రభుత్వాలకు మీడియా వాళ్ళ సమస్యలు గానీ వారి యొక్క జీవన విధానంలో వారు ఎదుర్కొనే సవాళ్ళపై గానీ అవగాహన లేకపోవడం వల్ల జర్నలిస్టులు ఆర్ధీకంగ,సామాజికంగా వెనుకబడిపోయారని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల మీద ఎంతో క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉన్నారని వారితో ప్రత్యేకంగా మాట్లాడితే గానీ తెలియలేదని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి కోసం వారు చేసిన సూచనల మేరకు జర్నలిస్టుల ప్రతి సమస్యలు పరిష్కారం చేసే విధంగా తాను కృషి చేస్తానని ఆ నమ్మకం తనకు ఏర్పడిందని ధీమా వ్యక్తం చేశారు.