మంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించిన ఆరె కటిక సంఘం ప్రతినిధులు
జియాగూడలోని స్లాటర్ హౌస్ పై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్వాన్ ఇన్ చార్జి ఉస్మాన్ బిన్ మహమ్మద్ అలీ హజ్రి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో ఆరె కటిక చర్మకశ్ సంఘం, ఆరె కటిక సంఘం జియాగూడ సంఘాల నాయకులతో కలిసి రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతీ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జియాగూడలోని మేకల, గొర్రెల స్లాటర్ హౌస్ ను ప్రభుత్వ నిధులతో నిర్మించి దానిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సంభందిత శాఖల అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరె కటిక సంఘం అధ్యక్షుడు టి నర్సింగ్ రావు, ఆరె కటిక చర్మకశ్ సంఘం అధ్యక్షుడు వి శశికాంత్ రావు, ప్రధాన కార్యదర్శి పి దర్శన్ కుమార్, ఉపాధ్యక్షుడు జి జ్ఞానేశ్వర్, వి సత్యం తదితరులు పాల్గొన్నారు.