అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
సీఎంఆర్ రైస్ డెలివరీని సకాలంలో పూర్తి చేయాలి
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 17 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినులకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు మంగళవారం అదనపు కలెక్టర్ ముదిగొండ మండలంలోని న్యూ లక్ష్మీపురం గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినుల తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో విద్యార్థినులకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నాణ్యమైన పౌష్టిక ఆహారం విద్యార్థినులకు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థినులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు విద్యా ప్రమాణాల పరిశీలన చేశారు అనంతరం ఖమ్మం కలెక్టరేట్ లో పెండింగ్ సిఎంఆర్ రైస్ డెలివరీ పై అధికారులు, రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సిఎంఆర్ రైస్ డెలివరీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాకు నిర్దేశించిన మేర రైస్ డెలివరీ సకాలంలో పూర్తి చేయాలని, రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేరకు నడిచి వారికి కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. యాసంగి సీజన్ కు సంబంధించి రైస్ డెలివరీ లక్ష్యాలను సైతం సకాలంలో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించు కోవాలని అదనపు కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు రాజేశ్వర రావు, అధికారులు, రైస్ మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.