మెదక్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

 

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర తెలంగాణ
వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్
కోదండ రెడ్డి.

ప్రజాబలం- దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి

17.09.2024:

మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్
రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ , అడిషనల్ ఎస్పీ మహేందర్ మెదక్ ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ,లతో కలిసి ముఖ్య అతిథిగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ చైర్మన్ కోదండ రెడ్డి పాల్గొని, ముందుగా అమరవీరుల స్థూపం వద్ద అంజలి ఘటించారు.
అనంతరం తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఛైర్మన్ కోదండ రెడ్డి, పుర ప్రముఖులకు, అధికార అనధికారులకు కలిసి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా ప్రగతిని, సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు.
త్యాగాల ఫలితమే తెలంగాణ అని,
తెలంగాణ అంటేనే మిశ్రమ సంస్కృతి ఉన్నదని ప్రజా పరిపాలన వైపు అడుగులు వేస్తూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు స్వతంత్ర సమరయోధులకు జోహార్లు తెలిపారు
స్వేచ్ఛ స్వతంత్రం ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి తెలంగాణ గడ్డమీద ఎంతోమంది త్యాగాలు చేశారు ఆ త్యాగాలు
ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని వివరించారు.
నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం పైనే దృష్టి పెట్టి, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అంచెలంచెలుగా లబ్ధిదారులుకు సంక్షేమ ఫలాలు అందిస్తూ విజయవంతంగా ఆరు గ్యారెంటీల పథకాలు ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని చేపట్టి, రైతులకు భరోసా కల్పించామని తెలిపారు.
సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిస్తున్నామని
వివరించారు.
జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తూ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాలనయంత్రంగానికి అభినందనలు తెలిపారు.
తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై పాటల రూపంలో సాంస్కృతిక ప్రదర్శనలు
చూపరులను అలరించాయి
ఈ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking