జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 17 : వాస్తు శిల్పి, ప్రతిమశాస్త్ర పితామహుడు విరాట్ విశ్వకర్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్తో కలిసి హాజరై విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనకరంగా వాస్తు ప్రకారం పట్టణాలు, భవనాల నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు, మన సంస్కృతిలో విగ్రహాల రూపకల్పనపై భావితరాలకు దిశానిర్దేశం అందించిన మహనీయుడు విరాట్ విశ్వకర్మ అని అన్నారు. భూమిపై జరిగే నిర్మాణాలన్నింటిలో నైపుణ్యాలు పెంచుకొని విశ్వకర్మలందరూ ప్రగతి సాధించాలని అన్నారు.విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్కుమార్,జిల్లా శాఖల అధికారులు,విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు కస్తూరి శ్రీనాథ్చేరి,ప్రధాన కార్యదర్శి రావుల హరీష్చరి,రాష్ట్ర విశ్వకర్మ వర్కింగ్ ప్రెసిడెంట్ పాలికోజు నర్సింహాచారి, ఓ.బి.సి.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగన్నపేట విజయ్కుమార్చారి, సంబంధిత అధికారులు, ఇతర సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.