ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 29 : ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలను జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలలో ప్రజలందరికీ తెలిసే విధంగా కళా యాత్ర నిర్వహించడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, గృహజ్యోతి, వంట గ్యాస్ రాయితీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,ఉద్యోగాల నియామకాలు, మహిళా శక్తి ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే జిల్లా వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.19 రోజుల పాటు జిల్లాలోని 114 గ్రామాలు,7 మున్సిపాలిటీలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో హైదరాబాద్ నుండి దాదాపు 50 మందితో కూడిన సాంస్కృతిక కళా బృందం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking