జిల్లా వ్యవసాయ అధికారి కల్పన
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 29 మంచిర్యాల జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరుగనున్న రైతు పండుగ కార్యక్రమాన్ని అధికారులు, రైతులు విజయవంతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి సమక్షంలో జరుగనున్న రైతు పండుగ వేడుకలలో భాగంగా జిల్లాలోని రైతు వేదికలలో ఆయా క్లస్టర్ రైతులు, అధికారులు హాజరై వారి ప్రసంగాన్ని వీక్షించి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని 55 క్లస్టర్లలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.