మేడ్చల్ నవంబర్ 29 ప్రాజబలం న్యూస్ :-
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర నాయకులు సగ్గిడి మల్లేష్, నాగిల్ల పాండు, భాష ఆధ్వర్యంలో బహుదూర్ పల్లి నుండి వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు స్థానిక సీతారామచంద్ర స్వామి వారికి , హనుమాన్ దేవాలయంలో కట్టమైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి శబరిమల అయ్యప్పస్వామి దివ్యక్షేత్రం దర్శనం కోసం బయలుదేరారు. అనంతరం రాష్ట్ర నాయకులు సగ్గిడి మల్లేష్,శ్రీనివాస్ భాష, పాండు మాట్లాడుతూ దైవారాధనలో మానసిక ప్రశాంతత దొరుకునని, దైవభక్తితో మానవ మనుగడకు మంచి లక్షణాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కృష్ణారెడ్డి, కోటేశ్వరరావు, తూప్రాన్ అయ్యప్ప భక్తుడు గడ్డం ప్రశాంత్ కుమారు,మైసిగారి నరేష్, మనోహర్, బాల్ రేడ్డి, లింగం, యాదగిరి, రామ్ రెడ్డి, వెంకటేష్,నర్సింగరావు, నరేష్, శైలేష్, మల్లేష్, సంతోష్, శ్రీకాంత్ , వినయ్, శంకర్ , శ్రీనివాస్ , సతీష్, నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.