హైదరాబాద్‌లో అంతర్జాతీయ అర్బన్ వర్క్‌షాప్

 

– గ్రేటర్ లో జల వనరుల సంరక్షణ, నీటి నాణ్యత పునరుద్ధరణకు ప్రతిపాదనలు అందజేయనున్న నిపుణులు

29, నవంబర్ 2024:
రాష్ట్ర ప్రభుత్వం,మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, లెస్ అటెలియర్స్ డి సెర్జీ, ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ , ఫ్రెంచ్ సంయుక్త సహకారంతో
హైదరాబాద్‌లో 13 రోజుల పాటు అంతర్జాతీయ అర్బన్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు.

నవంబర్ 25 న ప్రారంభమైన వర్క్ షాప్
డిసెంబర్ 6 వరకూ కొనసాగుతుంది.

” నీరు , మెట్రోపాలిటనైజేషన్ ఏ బయో క్లైమేట్ సిటీ ఆఫ్ లేక్స్ హైదరాబాద్ కమ్స్ ఫుల్ సర్కిల్ యాజ్ హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్” పేరుతో నిర్వహిస్తున్న ఈ వర్క్ షాప్ లో వివిధ విభాగాలకు చెందిన
అంగోలా, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇండియా, నేపాల్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన
15 మంది స్థానిక , అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.

వర్క్‌షాప్‌లో భాగంగా ఇప్పటికే రెండు రోజులు మహ నగరంలో క్షేత్ర సందర్శనలు చేసి జల వనరులను పరిశీలించారు. నగరంలో జల వనరులు, సరస్సుల సంరక్షణ, చెరువులలో మురుగు నీరు కలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి పర్యావరణ వ్యవస్థల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వినూత్న, కార్యాచరణ , ప్రాదేశిక ఆలోచనలను ప్రజా ప్రతినిధులు , పురపాలక అధికారులకు వివరిస్తారు.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో
నీటి సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి , నీటి వనరుల సంరక్షణ , నీటి నాణ్యత,
వారసత్వాన్ని సంపూర్ణంగా పునరుద్ధరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తారు.

వర్క్‌షాప్ చివరలో మూడు బృందాలు జల సంరక్షణ, నీటి నాణ్యత పునరుద్ధరణ
అమలుకు సంబంధించి తమ ప్రతిపాదనలను అందజేయనున్నాయి.

MCHRDలో సమావేశం

ఈ వర్క్ షాప్ లో భాగంగా
శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో గ్రేటర్ లో జల సంరక్షణ, నీటి నాణ్యత పునరుద్ధరణ తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు అధికారులకు వివరించారు.

సమావేశంలో MRDCL ED శ్రీనివాస్ రెడ్డి ,
Srinivas Reddy , MRDCL టెక్నికల్ ED
సత్యనారాయణ, MRDCL CE
DATTU PANTH , SE Vidyasagar , EE శంకర్, Les Atliers French సంస్థ డైరెక్టర్
డైరెక్టర్ Véronique Valenzuela, ప్రాజెక్టు డైరెక్టర్ Simon Brochard, వర్క్ షాప్ పైలెట్ లు Florence Bougnoux and Reena Mahajan లు , NIUM మేనేజర్ ( ఆపరేషన్) సురేష్, మేనేజర్ ( నాలెడ్జ్) ఆసిం,Conservative Architect నిత్య, నగరంలోని జల వనరుల నిపుణులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking