పట్టణ జీవవైవిద్యాన్ని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత: మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

జీహెచ్‌ఎంసీ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్‌, నవంబర్‌ 29: పట్టణ జీవవైద్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు. పట్టణ ప్రాంతాల్లో జీవవైవిద్య పాముఖ్యత, జీవవైవిధ్యాన్ని కాపాడటం, సంరక్షించడం పై సామాజికంగా మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె అన్నారు.
జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ, ఐ.సి.ఎల్‌.ఇ.ఐ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పట్టణ జీవవైవిద్యం పై నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో భాగంగా శుక్రవారం బేగంపేటలోని తాజ్‌ వివంత హోటల్‌ లో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో పట్టణ ప్రాంతాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడటం, సంరక్షించడం, దాని ప్రాముఖ్యతను తెలియజేయడం, అభివృద్ధి, పట్టణీకరణ తో జీవవైవిధ్యం ఏ విధంగా పభావితం అవుతుందో చర్చించడం తో పాటు పట్టణ జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చించడం, జీవవైవిధ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ… ఆరోగ్యకర నగరాలు, స్థిరత్వమైన పట్టణాభివృద్ధిలో పట్టణ జీవవైవిద్యంఅత్యంత కీలకమైందన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో గాలి, నీటి నాణ్యత నుండి పట్టణ పర్యావరణ వ్యవస్థల మొత్తం స్థితిస్థాపకత వరకు ప్రభావితం చేస్తుందన్నారు. పట్టణ వ్యవస్థను మరింత పటిష్టంగా ఉండటానికి జీవవైవిద్యం ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరం మేరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నగరాలు గ్లోబల్‌ జిడిపిలో 80 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంటాయని అన్నారు. కానీ అదే సమయంలో మూడు వంతుల గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్ఘారాలు ముఖ్యంగా ఢల్లీి, ముంబాయి, బెంగళూరు వంటి కేంద్రాల నుండి వస్తున్నాయని, డబ్ల్యు.ఈ.ఎఫ్‌ నివేదిక ప్రకారం దాదాపు 30 లక్షల కోట్ల రూపాయాల విలువైన ఆర్థిక కార్యకలాపాలు బయోడైవర్సిటీ లోపం వల్ల ప్రమాదంలో ఉన్నాయని అంచనా గలదన్నారు.

అర్బన్‌ బయోడైవర్సిటీ పరిరక్షణలో హైదరాబాద్‌ నగరం గుర్తింపు పొందిందన్నారు. విభిన్న పర్యావరణ వ్యవస్థలు, పచ్చదనం పెంపు, ప్రకృతితో అనుసంధానం చేసే ప్రణాళికలు అమలు చేయడం ద్వారా ఇతర నగరాలకు హైదరాబాద్‌ మోడల్‌ గా నిలుస్తుందన్నారు. జీవవైవిధ్యాన్ని రక్షించడంలో, మెరుగు పర్చడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. పచ్చని ప్రదేశాలను పెంచడం, సహజ ఆవాసాల ను పరిరక్షించడం, బయో కారిడార్ల ఏర్పాటు, జలాశయాల పరిరక్షణ, అర్బన్‌ బయోడైవర్సిటీ (యు.బి.డి విభాగం) ఆధ్వర్యంలో విస్తృత పూల తోటలు, పచ్చటి ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

హైదరాబాద్‌ నగరం యు.ఎన్‌.ఇ.పి గ్రీన్‌ సిటీస్‌ప్రోగ్రాం మరియు ఇంటర్నేషనల్‌ అర్భన్‌ పార్క్స్‌అవార్డ్స్‌ ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందన్నారు. నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీ, ఐ.సి.ఎల్‌.ఈ.ఐ వంటి సంస్థల భాగస్వామ్యంతో పర్యావరణ సమతుల్యతనునిర్ధారించడంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డ్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బయోడైవర్సిటీ పరిరక్షణలో హైదరాబాద్‌ నగరం ముందుందని, ప్రజల భాగస్వామ్యంతో, ఆచరణాత్మక ప్రణాళికలతో మరింత ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
హెచ్‌.ఎం.డి.ఏ కమిషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ… పట్టణ అభివృద్ధి ప్రణాళిక లో బయోడైవర్సిటీ ని ఒక అంతర్భాగంగా తీసుకోవడం అవసరమన్నారు. పచ్చదనాన్ని, ప్రకృతి ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహించడంలో పట్టణ పాలక సంస్థల పాత్ర కీలకమన్నారు. బహుళ శాఖల మధ్య సమన్వయం కల్పించడంతో బయోడైవర్సిటీ పరిరక్షణలో మరింత పురోగతి సాధించవచ్చన్నారు.
జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ ఛైర్‌ పర్సన్‌ సి.అచలేందర్‌ రెడ్డి మాట్లాడుతూ… బయోడైవర్సిటీ పునరుద్దరణకు భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందింస్తుందన్నారు. జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ విధానాలు, లక్ష్యాలు దేశంలో అర్భన్‌ ఏకో సిస్టం ల పునరుద్దరణ లక్ష్యంగా గలదన్నారు. హైదరాబాద్‌ నగరంలోని బయో కారిడార్ల అభివృద్ధి ఇతర నగరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. సమిష్టి కార్యక్రమాలతో జీవవైవిధ్య పరిరక్షణ లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని సూచించారు.

ఈ సదస్సులో మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్మెంట్‌ ఫారెస్ట్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌ అడ్వైజర్‌ రఘు కుమార్‌ కొడాలి, జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ సెక్రటరీ డా.బి.బాలాజీ, డా.బిక్షం గుజ్జ, డా.జి.చంద్రశేఖర్‌ రెడ్డి, హరీష్‌ చంద్ర ప్రసాద్‌ యార్లగడ్డ, ఐ.సి.ఎల్‌.ఈ.ఐ అసోసియేట్‌ డైరెక్టర్‌ డా.మోనాలిస సేన్‌, డా.సాయిరాం రెడ్డి పాలిచెర్ల, సంజీవ్‌ కార్పే, రోజ్‌ కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌నయాన్‌ బెన్‌ పెదాడియా, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ కమీషనర్లు, అటవీ శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఎన్జీఓలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking