మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 1:
రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటివరకు మన జిల్లాకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.
ప్రజావాణి మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, లా ఆఫీసర్ ప్రభావతితో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులందరూ తమ పరిధిలో ఇప్పటివరకు ప్రజావాణి లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, మీ పరిధిలో పరిష్కరించలేని దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆన్ లైన్ లోనే దరఖాస్తుదారునికి వివరణ ఇవ్వాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో (114) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.