ప్రజా పాలన దినోత్సవ పండగని ఘనంగా నిర్వహించాలి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి….

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజా బలం దినపత్రిక
మెదక్ జిల్లా ప్రతినిధి
16.09.2024:

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు రాకుండా మినిట్ టు మినిట్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడానికి మినిట్ టు మినిట్ షెడ్యూల్ తయారు చేశామని, అట్టి షెడ్యూల్ ప్రకారం ముందుకు పోతున్నామన్నారు.
ఇట్టి వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ & రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఉదయం 10 గంటలకు ముఖ్య అతిథిచే జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉదయం 9 గంగలకు ఐడిఓసి కార్యాలయానికి హజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి. కలెక్టరేట్ ఏవో యూనస్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking