హాజరైన మామిళ్ల జ్యోతి కృష్ణ , కల్లూరి హరికృష్ణ, పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు
మెదక్ తూప్రాన్ సెప్టెంబర్ 16 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పట్టణ నడి ఒడ్డున గాంధీ యూత్ వినాయకుని వద్ద కుంకుమార్చనలు , గణపతి పూజ సంకీర్తనలు, భక్తిశ్రద్ధలతో మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా తాజా మాజీ ఎంపీపీల పోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ హాజరై షలాక రాజేశ్వర శర్మ పంతులుగారి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గాంధీ యూత్ వినాయకుడు వారు ప్రతి సంవత్సరం వినాయకుని ఏర్పాటు చేసి మండపం మండపం వద్ద అన్నప్రసాదం కార్యక్రమము నిర్వహిస్తున్నామని అన్నారు వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమార్చనలు భజనలు పుష్పార్చనలు ప్రత్యేక పూజలు చేపట్టడం జరుగుతుందని వివరించారు భక్తి భావనతో భజన సంకీర్తనలతో అంగరంగ వైభవంగా వినాయక మండపం వద్ద మహిళలు చిన్నారులు కోలాటాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గాంధీ నిర్వాహకుల నాయకులు కౌన్సిలర్లు కోడిప్యాక నారాయణ గుప్తా, భగవాన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెర్ల రవీందర్ గుప్తా , బాలరాజ్ గుప్తా, దుర్గం నాగేష్, వెంకట్రాం రెడ్డి, శేఖర్ గౌడ్, నాగేశ్వరరావు, శ్రీనివాస్ గుప్తా, నాగరాజ్ గుప్తా,గడ్డం ప్రశాంత్ కుమార్, గడ్డం వెంకట్, ప్రవీణ్, వంశీధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాగరాజ్, శేఖర్, నర్సింలు, నవీన్, సిద్ధి రాములు, రమేష్, రాజయ్య, ప్రదీప్, గాంధీ యూత్ సభ్యులు ప్రజా ప్రతినిధులు, చుట్టుపక్కల గ్రామస్తులు, గాంధీ కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు.
