మోడీ గ్యారెంటీ పథకాలపై అవగాహన సదస్సు ..
భారత్ వికసిత్ సంకల్ప యాత్ర..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అందరూ ఉపయోగించుకోవాలి..
మెదక్ తూప్రాన్ జనవరి 23 ప్రాజబలం న్యూస్:-
ప్రజా ఆరోగ్యమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అగ్రికల్చర్ ఏఈఓ సంతోష్,భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, పేర్కొన్నారు.. మంగళవారం తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో భారత్ వికసిత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని వివిధ శాఖల అధికారులతో పాటు తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వంలోని పలు పథకాలను ప్రజలకు వివరించారు ఇన్సూరెన్స్ ,,,ప్రధాని సురక్ష ద్వారా లాభాలను ప్రజలకు వివరించారు తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ ఖాజా మొహీనుద్దీన్, మున్సిపాలిటీ ఆర్ ఐ రమేష్, మేనేజర్ రఘువరన్, మాట్లాడుతూ మహిళలకు తక్కువ వడ్డీతో నాలుగు నుంచి ఐదు లక్షల వరకు రుణాలు అందజేస్తామని అవసరమున్నవారు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య మరియు అగ్రికల్చర్ అధికారులు ఏ ఈ ఓ సంతోష్, వివిధ శాఖల బ్యాంక్ అధికారులు బిజెపి నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు జానకిరామ్ గౌడ్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంఖ్య యాదగిరి, తూప్రాన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ జమాల్పూర్ లక్ష్మీబాయి నర్సోజి, తాటి విట్టల్, సిద్ధిరాములు, మహేష్ తదితరులు పాల్గొన్నారు..