–గ్రేటర్ హైదరాబాద్ ముమ్మరంగా
వర్షాకాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం
– ప్రత్యేక డ్రైవ్ కు ప్రజల నుంచి విశేష స్పందన
– ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కమిషనర్ ఆర్ వి కర్ణన్
– మాన్సూన్ డ్రైవ్ ప్రభావవంతంగా అమలుకు సూచనలు
హైదరాబాద్, జులై 30, 2025:
వర్షాకాలం నేపథ్యంలో నగర ప్రజారోగ్యమే లక్ష్యంగా…
కదిలిన జీహెచ్ఎంసీ యంత్రాంగం కదిలింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో జూలై 29 నుండి ప్రారంభమైన వర్షాకాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే 30 వార్డులలో పూర్తి కాగా ఆగస్ట్ 8 నాటికి మొత్తం 150 వార్డులలో వర్షాకాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ప్రభావంతంగా అమలు చేసి నగరాన్ని “ఆరోగ్య, పరిశుభ్ర హైదరాబాద్ ” గా తీర్చిదిద్దే లక్ష్యంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ల మార్గదర్శనంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ నేతృత్వంలో ముందుకు సాగుతుంది.

” పరిశుభ్ర హైదరాబాద్” లక్ష్యంగా…*
కమిషనర్ నుండి కార్మికుడి వరకూ
” పరిశుభ్ర హైదరాబాద్” లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో శ్రమిస్తున్నారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ఘన వ్యర్థాలు , నిర్మాణ & కూల్చివేత వ్యర్థాలు, పచ్చి వ్యర్థాలు, ఇంజనీరింగ్, అర్బన్ బయో డైవర్సిటీ విభాగాల పనుల కారణంగా ఏర్పడిన మిగులు వ్యర్థాలు, వర్షాల వల్ల ఏర్పడిన సిల్ట్ డిపాజిట్‌లను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. ప్రతిరోజూ నిత్య సానిటేషన్ కార్యక్రమాల తరువాత
రోజూ ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నారు.

అధికారులు, కార్మికులు హై అలెర్ట్
కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ అమలుపై శ్రద్ద పెట్టడంతో పాటు ప్రతి రోజూ ఉదయం ఆకస్మిక తనిఖీ లు చేపడుతున్నారు. ఎల్ బి నగర్, చార్మినార్, కూకట్ పల్లి, ఖైరతాబాద్ జోన్ లలో ఇప్పటి వరకూ ఈ డ్రైవ్ అమలును పరిశీలించడం , క్షేత్ర కార్యకలాపాల పై ఆరా తీస్తుండడంతో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆరోగ్య శాఖాధికారులు, SWM ఇంజనీర్లు, సర్కిల్ మేనేజర్లు, ఎంటమాలజిస్టులు ఈ డ్రైవ్‌ను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు.
దోమలు పుట్టకుండా, కుట్టకుండా..
దోమలు పుట్టకుండా, కుట్టకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవ్ లో భాగంగా అధికారులు ఇంటి ఇంటికి వెళ్లి
ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను నగర ప్రజలకు పంపిణీ చేస్తూ వారు డెంగ్యూ,మలేరియా వంటి కీటక జనిత వ్యాధుల బారిన పడకుండా చైతన్యం చేస్తున్నారు.
ఆరోగ్య హైదరాబాద్ కు పిలుపు
ఆరోగ్య హైదరాబాద్ కు ప్రజా సహకార
అవసర ప్రాధాన్యతను అధికారులు నగర పౌరులకు తెలియజేస్తున్నారు.
ప్రజలందరూ పరిశుభ్రత బృందాలకు సహకరించాలని, పబ్లిక్ ప్రదేశాల్లో వ్యర్థాలను వేయవద్దని కోరుతున్నారు
పరిశుభ్రమైన వాతావరణం వ్యాధులను వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రజారోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనీ ప్రజలకు తెలియజేస్తున్నారు.
––––––––––––––––––––
ఈ రోజు జీహెచ్ఎంసీ మా హిమాయత్ నగర్ విట్టల్ వాడి కాలనీలో వర్షాకాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కార్పొరేటర్, డిప్యూటీ కమిషనర్ లు డ్రైవ్ లో స్వయంగా పాల్గొని ప్రజా భాగస్వామ్యం తో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.
చెత్త, చెదారం, వరదల వల్ల పోగైన సిల్ట్ ను తొలగించారు.
వర్షాలతో అస్తవ్యస్తమైన పారిశుధ్యం డ్రైవ్ తో మెరుగుపడింది.
– మండపల్లి కళ,విట్టల్ వాడి
––––––––––––––––––––
మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా మా కాలనీలో అధికారులు ఆరోగ్య అవగాహన, చైతన్యం ర్యాలీ నిర్వహించారు. మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు. దోమలు వృద్ధి చెందకుండా, కుట్టకుండా , డెంగ్యూ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లు ఇంటింటికి వెళ్లి వివరించారు.
కరపత్రాలు పంపిణీ చేశారు.
– అంబికా జైస్వాల్ , విట్టల్ వాడి
––––––––––––––––––––
కమిషనర్ ఆదేశాల మేరకు గోషా మహల్ సర్కిల్ లో వర్షాకాల ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నాం. వర్షాల వల్ల ఎక్కడైనా చెత్త పోగైన, వ్యర్థాలు పేరుకుపోయిన, సిల్ట్ నిల్వ ఉన్న క్షేత్ర స్థాయిలో గుర్తించి తొలగిస్తున్నాం. కీటక జనిత వ్యాధుల బారిన పడకుండా ప్రజలను చైతన్యం చేస్తున్నాం. ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా పని చేస్తున్నాం.
– ఉమా ప్రకాష్, డిప్యూటీ కమిషనర్, గోషా మహల్ సర్కిల్
