👉 రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి
ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి (జులై 30 ప్రజాబలం )సంగారెడ్డి జిల్లా : అందోల్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమన్వయ సమావేశంలో, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు, మీనాక్షి నటరాజన్, చేపట్టిన పాదయాత్రలో స్వచ్ఛందంగా కార్యకర్తలు వేలాదిగా పాల్గొనాలని సూచించారు, (ఏ ఐ సీ సీ ) తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఆగస్టు 1న, సాయంత్రం 5:00 గంటలకు ఆందోల్,నియోజకవర్గంలో , చేపట్టిన పాదయాత్రతో పాటు 2వ తారీఖున జరిగే శ్రమదానం, పార్టీ కార్యకర్తలతో సమావేశంను, విజయవంతం చేయటానికి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, దామోదర్ రాజనర్సింహ, అధ్యక్షతన సంగారెడ్డి లోని తన నివాసంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో, ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని విభాగాల శ్రేణులు, స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్టీ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు, ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ , ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ప్రజల్లోకి తీసుకెళ్లాలని విస్తృతంగా తీసుకెళ్లాల కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి దామోదర్ నాది నరసింహ కోరారు, ఈ ఆత్మీయ సమన్వయ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అందోల్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మండలాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్య నేతలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు
