డెవలప్మెంట్‌ విజన్‌ ఉన్న లీడర్‌ ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్‌ రావ్‌

విజయ డైరీ డిడి కార్యాలయం తరలిపోలేదు
బిఆర్‌ఎస్‌ హయాంలో ఎన్ని ఆఫీసులు తరలిపోయాయో చెప్పండి
స్థానిక ఎన్నికల్లో గెలుపు మాదే
ప్రజల దృష్టి మళ్ళించేందుకు బిఆర్‌ఎస్‌ కుట్ర
మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌
మెదక్‌ ప్రజాబలం ప్రతినిధి: మెదక్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మైనం పల్లి రోహిత్‌ రావ్‌ డెవలప్మెంట్‌ విజన్‌ ఉన్న లీడర్‌ అని,
విజయ డైరీ డిడి కార్యాలయం తరలిపోయిందని బిఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మేడి మధుసూదన్‌ రావ్‌ లు తెలిపారు. బుధవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.ప్రజల దృష్టి మళ్ళించేందుకు బిఆర్‌ఎస్‌ నేతలు కుట్ర చేస్తున్నారని, వారి కుట్రలను పటా పంచలు చేసే రోజులు ముందున్నాయన్నారు.రూ 55కోట్ల తో త్వరలో మెదక్‌ పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వారు తెలిపారు. బిఆర్‌ఎస్‌ హయాంలో ఎన్ని కార్యాలయాలు సిద్ధిపేట కు సంగారెడ్డి కి తరలిపోయాయో బిఆర్‌ఎస్‌ శ్రేణులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌ నుంచి తరలిపోయిన కార్యాలయాలను మెదక్‌ కు తీసుకువచ్చేలా ఎమ్మెల్యే రోహిత్‌ రావ్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. బిఆర్‌ఎస్‌ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.అబద్దాలు మానుకొని మెదక్‌ అభివృద్ధి పై సలహాలు ఇస్తే గౌరవిస్తామని, ఏది పడితే అది మాట్లాడితే సహించబొమని వారు హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందెందుకు బిఆర్‌ఎస్‌ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమన్నారు.ఈ సమావేశం లో మెదక్‌ మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్లు ముత్యం గౌడ్‌, లింగం,లక్ష్మి నారాయణ,కొర్వి రాములు, వసంత్‌ కుమార్‌, అవారి శేఖర్‌, సమీ, దుర్గాప్రసాద్‌, కాంగ్రెస్‌ నాయకులు బొజ్జ పవన్‌,హంజద్‌, భానీ, నిఖిల్‌ తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking