బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవసాయం మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..

 

ఎరువుల పంపిణీ ఎలా జరుగుతుందో తెలియని రామచంద్రరావు  బీజేపీ అధ్యక్షుడు ఎలా అయ్యారు

రాష్ట్రానికి తగినంత ఎరువులు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు విజ్ఞప్తి చేశారు..

రావాల్సిందాని కన్నా తక్కువగా ఎరువులు రావడం వల్లే రాష్ట్రంలో ఇబ్బందులు

ఎరువుల లోటు పై రాష్ట్ర ప్రభుత్వం ను బధనం చేయడం కంటే బిజెపి అధ్యక్షుడు మీ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రైతుల ఇబ్బందులు తొలగించండి – మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రాలకు ఎరువుల సరఫరా ఎక్కడ నుండి వస్తుంది ఎవరు చేస్తారు అని అవగాహన కూడా లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు  మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎరువులు రాష్ట్రాల్లో తయారు అయినప్పటికీ అవి రాష్ట్రాల అవసరాల మేరకు తగిన సరఫరా పూర్తిగా కేంద్రం పరిధిలో ఉంటుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా ఎరువులు డిమాండ్ కి తగిన విధంగా సప్లై లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులకు కొంత మేర ఎరువుల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణ కు 9.80 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా.. ఇప్పటి వరకు 12.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని బీజేపీ అధ్యక్షడు రామచంద్రరావు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇప్పటి వరకు తెలంగాణ కి వచ్చిన యూరియా వివరాలు చూసినట్లయితే

.ఏప్రిల్ 2025 లో 1.70 LMT యూరియా సరఫరా ప్రణాళిక వేయగా 1.21 LMT మాత్రమే సరఫరా చేయబడింది (29%లోటు)

.మే 2025 లో 1.60 LMT యూరియా సరఫరా ప్రణాళిక వేయగా 0.88 LMT మాత్రమే సరఫరా చేయబడింది (45% లోటు)

.జూన్ 2025 లో 1.70 LMT యూరియా సరఫరా ప్రణాళిక వేయగా 0.98 LMT మాత్రమే సరఫరా చేయండి (42 % లోటు)

.జూలై 1.60 LMT యూరియా సరఫరా ప్రణాళిక వేయగా 1.28 LMT యూరియా సరఫరా మాత్రమే జరిగింది (20% లోటు)

ఈ సంవత్సరంలో మొత్తం ఏప్రిల్ నుండి జూలై వరకు 6.60లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ప్రణాళిక చేయబడగా 4.35 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేయబడింది ఇంకా 2.25 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడింది.

నెలవారి సరఫరా లోటు పై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఈనెల 8 వ తేదీన కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి గారిని కలసి తెలంగాణ ఎరువుల సరఫరా లోటు పై విజ్ఞప్తి చేశారు. మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కేంద్ర ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రోజువారి యూరియా అమ్మకాలు సగటున 10 వేల – 13 వేల మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయి..

ఇప్పటి వరకు తెలంగాణకు వచ్చిన యూరియా 4.35 లక్షల మెట్రిక్ టన్నులు అయితే బీజేపీ అధ్యక్షులు 12.02 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైతుల విషయంలో రాజకీయాలు మాని కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర మంత్రులు ,రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంప్రదింపులు జరిపి రైతగానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

ప్రజా పాలన ప్రభుత్వంలో తెలంగాణ రైతాంగానికి ఇబ్బందులు లేకుండా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎరువుల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking