ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూలై 08 :
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. కలెక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ, సి హెచ్ మహేందర్ జి లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పలు సమస్యలతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలు రెవిన్యూ శాఖ కు సంబంధించినవి (35), ఉద్యోగాలకు సంబంధించినవి (02), పెన్షన్ లు (01),ఇతర శాఖలకు సంబంధించినవి (8), మొత్తం (46) దరఖాస్తులను స్వీకరించడం జరిగినదని తెలిపారు.
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి అర్జీదారుల సమస్యలను, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్ డి ఓ సత్యా పాల్ రెడ్డి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, డి ఎమ్ హెచ్ ఓ అప్పయ్య, ఎస్సీ ఈడి తుల రవి, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనిన , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర , సివిల్ సప్లై మేనేజర్ బి రాంపతి , మైనార్టీ శాఖ అధికారి ప్రేమలత, జిల్లా అధికారులు, వివిధ శాఖల సంబంధిత అధికారులు 9 మండలాల తహసీల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.