కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు గౌరవ కిషన్ రెడ్డి ని కలిసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులను సెక్షన్ 11A / 17(A) MMDR 1957 ప్రకారం సింగరేణి కే కేటాయించాలని విజ్ఞప్తి చేసిన AITUC , INTUC & BMS నాయకులు .
తేదీ 08-07-2024 హైదరాబాద్ లోని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి కార్యాలయంలో వారిని కలిసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులను సెక్షన్ 11A / 17(A) MMDR 1957 ప్రకారం సింగరేణి కే కేటాయించాలని, అలాగే ఇప్పటికే వేలంలో పెట్టిన కోయాగుడెం , సత్తుపల్లి -3 , శ్రావణ పల్లి -3 కల్యాణి ఖని బ్లాక్ లను సింగరేణి కే కేటాయించాలని , సత్తుపల్లి బ్లాక్ కి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ఒబి పోయడానికి వారికి స్థలం లేదని , ఇల్లందు లోని కోల్ బ్లాక్ షెడ్యుల్ ఏరియా లో ఉందని దానిని ప్రవేటు వాళ్ళు కి కేటాయించడం చట్ట విరుద్ధం అని మిగిలిన వాటికి అనేక సార్లు వేలం లో పెట్టిన ఎవరు ఆసక్తి చూపలేదని వాటిని నామినేషన్ పద్దతి ద్వారా సింగరేణి కే కేటాయించాలని అలాగే VK7 , RKPOC , ఇల్లందు 21 ఇంక్లైన్ కి పర్యావరణ అనుమతులు రాక ఉత్పత్తి కి తగ్గుతుందని వాటికి కూడా సహకరించాలని , అలాగే గౌరవ కేంద్ర మంత్రి వర్యులు బొగ్గు గనుల శాఖ మంత్రి గా నియమితులైన వెంటనే ఒడ్డిశా లోని నైని ప్రాజెక్ట్ కి పర్యావరణ అనుమతులు మంజూరు చేయటం లో కృషి చేసినందుకు యూనియన్ నాయకలు వారికి కృతజ్ఞతలు తెలిపారు .
అలాగే రిటైర్ కార్మికుల పెన్షన్ రివిజన్ , కాంట్రాక్ట్ కార్మికుల హై పవర్ వేతనాలు అమలు వంటి వాటి పై దాదాపు గంట సేపు చర్చించారు.
వీటికి కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి తాను సింగరేణి కి అండగా ఉంటానని హామీ ఇవ్వడమే కాకుండా ఇతర రాష్ట్రాలలో సింగరేణి విస్తరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు , INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారు , AITUC జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్ , INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , BMS నాయకులు పులి రాజిరెడ్డి , రమాకాంత్ , రిటైర్డ్ పెన్షన్ సంఘం నాయకులు JV దత్తాత్రేయ , KRC రెడ్డి INTUC సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ కుమార్ యాదవ్ , పాల్గొన్నారు.