దేశంలో సంక్షేమం అంటే వైఎస్సార్‌ గుర్తుకువస్తారు.సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:వైయస్సార్‌ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ మధుయాష్కి గౌడ్‌
జనహృదయనేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి వేడుకలను పురస్కరించుకొని సీఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్‌ మున్షి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్యసభ మాజీ సభ్యులు కెవిపి రామచంద్ర రావు , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ , అంజన్‌కూమార్‌ యాదవ్‌ ,రాజ్యసభసభ్యులు అనిల్‌కుమార్‌ యాదవ్‌,
తదితర కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలతో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ .. పంజాగుట్ట చౌరస్తాలోని రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ప్రజా భవన్‌ లో ఏర్పాటు చేసిన వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి ఫోటో ఎగ్జిబిషన్‌ ను సందర్శించారు. ప్రదర్శనలో రాజశేఖర్‌ రెడ్డి చిన్ననాటి చిత్రాలతో పాటు రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన ఘటనలు తెలియజేసేలా ఫోటోలు ఏర్పాటు చేయగా.. వాటిని అందరూ ఆసక్తిగా తిలకించారు. ఆ తరువాత గాంధీభవన్లో జరిగిన రాజశేఖర్‌ రెడ్డి గారి జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. సీఎం రేవంత్‌ రెడ్డి గారు, రాష్ట్ర ఇంచార్జ్‌ దీపా దాస్‌ మున్షి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర పార్టీ ముఖ్య లతో కలిసి రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి మధుయాష్కి గౌడ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపును సందర్శించారు. అనంతరం మైనారిటీ సెల్‌ నాయకులు నిర్వహించిన జయంతి వేడుకల్లోనూ పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి
దేశంలో సంక్షేమం అంటే వైఎస్సార్‌ గుర్తుకువస్తారు.
మూసి అభివృద్ధి ,మెట్రో రైలు ,హైదరాబాద్‌ లో శాంతి భద్రతల విషయం లో వైఎస్సార్‌ మాకు స్పూర్తి.
రాహుల్‌ గాంధీ ని ప్రధాని చేయడం తన లక్ష్యమని వైఎస్సార్‌ రెండో సారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం సంధర్భంగా చెప్పారు.
రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర కు స్పూర్తి..వైఎస్సార్‌ చేవెళ్ల నుంచి ఇఛ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రే..
నిన్నటికి నేను పీసీసీ అధ్యక్షుడి పదవి చేపట్టి మూడేళ్ళు అయింది..
వైఎస్సార్‌ జయంతి సంధర్భంగా 35 మందికి కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పదవులు ఇచ్చాం.
పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే స్పూర్తి వైఎస్సార్‌ ఇచ్చారు..
టీ కాంగ్రెస్‌ ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ..
వైఎస్సార్‌ లాంటి గొప్ప మనిషిని చూడలేదు.
ప్రజలు కోరుకున్న పాలనను వైఎస్సార్‌ అందించారు.
ఇన్నేళ్లు అయినా ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ నిలిచిపోవడం గొప్ప విషయం..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అతి తక్కువ సమయం లో గొప్ప పనులు చేసి కోట్ల మంది ప్రజల మనస్సులో వైఎస్సార్‌ చోటు సాధించారు.
వైఎస్సార్‌ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాం..
అభివృద్ధి ని ,సంక్షేమం ను రెండు కళ్ళలా వైఎస్సార్‌ చూసాను.
జలయజ్ఞం ద్వారా వ్యవసాయానికి నీరందించారు.
ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ ద్వారా పేద పిల్లలకు వైఎస్సార్‌ దేవుడు అయ్యాడు.
ఆరోగ్య శ్రీ ద్వారా మేమున్నాం అని పేదలకు బరోసా ఇచ్చారు.
హైదరాబాద్‌ అభివృద్ధి లో వైఎస్సార్‌ ది చెరగని ముద్ర..
రాబోయే రెండు దశాబ్దాలు తెలంగాణ లో కాంగ్రెస్‌ దే అధికారం
ప్రజా పాలనను చూసి కాంగ్రెస్‌ ను వీడిన వారంతా మళ్ళీ పార్టీ లో చేరుతున్నారు.
వైఎస్సార్‌ అభిమానులు అంతా కాంగ్రెస్‌ లో చేరండి.
ఆర్దిక ఇబ్బందులు ఉన్నా..ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నాం.
ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.. అమలు చేస్తాం.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశన సంక్షేమ పథకాలు తెలుగు ప్రజల మనసుల్లో స్థాయిగా నిలిచిపోయాయి అన్నారు. పార్టీని బలోపేతం చేయడంలోనూ, అవసరమైన సంక్షేమ పథకాలను అందించడం ద్వారా ప్రజల మన్ననలను పొంది, మహానేతగా ఎదిగారన్నారు. రాహుల్‌ గాంధీ గారిని ప్రధానమంత్రి ని చేయాలని బలంగా ఆకాంక్షించారని పేర్కొన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఆయన ఆశలను కొనసాగిద్దామని పేర్కొన్నారు.
బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌ దగ్గర

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి , దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ప్రొన్నం ప్రభాకర్‌ , ఎమ్మెల్యే దానం నాగేందర్‌ , కేవీపీ రామచంద్రరావు , ఎమ్మెల్సీ వెంకట్‌ జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మీ తో కలిసి నివాళి అర్పించడం జరిగింది. ఇతర కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking