ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 06 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో ఎస్సై గా పోచంపల్లి సతీష్ శనివారం సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేసిన చంద్రకుమార్ రామగుండం వి ఆర్ కు బదిలీ కావడంతో అతని స్థానంలో నూతన ఎస్సైగా సతీష్ పూర్తి బాధ్యతలు స్వీకరించారు. నూతనమెగా బాధ్యతలు తీసుకున్న ఎస్సైకి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బదిలీ పై వెళ్తున్న చంద్రకుమార్ ఎస్సై ని సిఐ నరేందర్ సార్ తోపాటు సిబ్బంది శాలువాతో సన్మానించారు.