తహసీల్దార్ ఆఫీస్ లో ప్రజావాణి ప్రారంభం

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

లక్షెట్టిపేట తహసీల్దార్ దిలీప్ కుమార్

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 10 : ప్రజావాణిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లక్షెట్టిపేట తహసీల్దార్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు.సోమవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం ప్రజావాణిని ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజావాణిలో ప్రజల నుండి పలు దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు.ప్రజలకు భూసమస్యలతో పాటు ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నా ప్రజావాణిలో దరకాస్తూ చేసుకుంటే తక్షణమేఆ దరకాస్తును సంబంధిత అధికారిచే పరిశీలించి సమస్య పరిస్కారం చేయడం జరుగుతుందన్నారు.ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇందులో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని,ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎంపీడీవో ఎన్ సరోజ,ఎస్సై సతీష్,ఏవో శ్రీకాంత్,ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking