పండితాపురం లో కొలువైన శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ని దర్శించుకున్న రాo రెడ్డి గోపాల్ రెడ్డి ఏపూరి మహేందర్ మేకల మల్లిబాబు యాదవ్
ఇల్లందు ప్రతినిధి మార్చి 10 (ప్రజాబలం) కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో కొలువైన శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం సందర్బంగా ఈనెల 8వ తారీకు నుండి 11 వ తారీకు వరకు జరుగు జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది మరియు సోమవారం నాడు ఊరేగింపు ఉత్సవం జరిగింది ఈ సందర్బంగా సోమవారం నాడు టి పి సి సి కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రాo రెడ్డి గోపాల్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏపూరి మహేందర్, షేక్ ఫతే మహమ్మద్ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి గ్రామ పెద్దలు, డి సి సి బి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, పూజారులతో మేళతాళాలతో ఎదురు వెళ్లి శాస్త్రోక్తంగా ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు తదనంతరం స్వామివారిని దర్శించుకుని, ఖమ్మం జిల్లాలో విశేష ప్రాచుర్యం పొందిన, మా ప్రాంత పురాతనమైన దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, దేవాలయ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తే బాధ్యత తీసుకుంటానని, స్వామివారి కరుణాకటాక్షాలు వల్ల గ్రామాలు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నామని రాంరెడ్డి గోపాల్ రెడ్డి తెలిపారు మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ కాకతీయుల కాలంలో ప్రతిష్టించబడిన నాటి నుండి సాంప్రదాయపరంగా శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమాలు మహాశివరాత్రి తర్వాత వచ్చే పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు జరుపుతున్నామని ఎంతో మహిమగల దేవుడని, ప్రతి సంవత్సరం నాలుగు రోజులపాటు జాతర కార్యక్రమం వైభవంగా జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, రాo రెడ్డి జగన్నాథ రెడ్డి, నల్లమోతు రామకృష్ణ కొంగర మాధవరావు నల్లమోతు లక్ష్మయ్య, దమ్మాలపాటి సత్యనారాయణ భానోత్ నరసింహ నాయక్, మేకపోతుల మహేష్, మేకల మల్లికార్జునరావు, మద్దినేని రమేష్, బ,శీలం పుల్లయ్య, బత్తుల నాగరాజు భూక్యా నాగేంద్రబాబు, దిండిగల శబరినాథ్, దొడ్ల వేణు, బత్తుల వీరబాబు, పసుమర్తి సత్యం, కొమ్మినేని అప్పారావు, ధరావత్ అనురాధ బత్తుల వీరబాబు బత్తుల ఉపేందర్ దండగల దేవేంద్ర దొడ్ల మల్లేశం బండి ఉపేందర్ బండి లక్ష్మీనర్సు, బానోతు రామచంద్రు, మొగిలి శ్రీనివాస్ మరియు తదితరులు భక్త బృందం పాల్గొన్నారు
