ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి..

ప్రజల నుండి148 దరఖాస్తులు స్వీకరణ

అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు

ప్రజావాణి లో కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా ప్రతినిధి
23.09.2024:

ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లాకలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో ప్రజల నుంచి కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం148 అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అర్హత మేరకు సమస్యలు పరిష్కార దిశగా కృషి చేయాలని, పరిష్కారం కాని సమస్యలపై ప్రజలకు వివరిస్తూ ప్రజావాణి పై ప్రజలకు నమ్మకం ఏర్పరిచే విధంగా చూడాలన్నారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులు వివరాలను తెలియజేశారు. ధరణి- 50, రుణమాఫీ-09, 02బి హెచ్ కే -05,
ఇతర సమస్యలు-84 మొత్తం 148 దరఖాస్తుల స్వీకరించినట్లు తెలిపారు
ఈ ప్రజావాణిలో డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, డిపిఓ యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

     

Leave A Reply

Your email address will not be published.

Breaking