జాతీయ లోక్ అదా లత్ ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఛైర్పర్సన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ పి .లక్ష్మీ శారద
సోమవారం జిల్లా న్యాయమూర్తి లక్ష్మీ శారద మాట్లాడుతూ నేషనల్ లోక్ అదాలత్ తేది: 28.09.2024 రోజున జిల్లా కోర్ట్ ప్రాంగణం, మెదక్ నందు మరియు నర్సాపూర్ కోర్టు నందు నిర్వహించబడును అని ఇట్టి లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను పరిష్కరించుకునే విధంగా న్యాయవాదులు సహకరించాలని కోరారు.
ఈ సదావకాశాన్ని ప్రజలు మరియు కక్షిదారులు వినియోగించుకుని ఎక్కువ మొత్తంలో కేసులను రాజీ కుదుర్చుకోవాలని మరియు ఇట్టి నేషనల్ లోక్ అదాలత్ ని విజయవంతం చేయాలని కోరారు.జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకొని ప్రతిరోజు సెటిల్మెంట్స్ జరుగును ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.