మెదక్ ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారి ఆదేశానుసారం జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ శ్రీ.ఎస్.మహేందర్ ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడం అయినది. ఈ కార్యక్రమంలో హవేలి ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కలాలి రూప నాకు సర్వే నెంబర్ 26/3/2 లో భూమి కలదని అట్టి భూమిని మేము 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని అట్టి భూమిలోకి కొందరు వ్యక్తులు వచ్చి నాపై దాడికి పాల్పడటం జరిగిందని ఆ భూమిని మేమే సాగు చేసుకుంటామని మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని హవేలి ఘనపూర్ ఎస్.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. అలాగే రేగోడ్ మండలం జగిర్యాల గ్రామానికి చెందిన కలాలి మల్లమ్మ తన ఇంటి లో ఉన్న బంగారాన్ని ఇంటి ముందర ఉన్న ట్రాక్టార్ ని మా గ్రామానికే చెందిన వ్యక్తి ఎత్తుకెళుతున్న సమయంలో మా గ్రామస్తులు చూసి నాకు ఫోన్ ద్వారా తెలిపినారని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని అల్లాదుర్గ్ సి.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. ఈ రోజు జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాది దారులు రావడం జరిగినది.