ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ప్యాక్టరీ ఏర్పాటు వద్దు అంటూ ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ తరపున సంఘీభావం ప్రకటిస్తున్నాం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి.
లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది.
ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే పచ్చటి పంట పొలాల మధ్య ఇథనాల్ ప్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
పరిశ్రమ ఏర్పాటుకు ముందు మాతో కానీ రైతులతో కానీ కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్చలు జరపలేదు.
24-02- 2023 నాడు కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకుండా నేరుగా అనుమతులు మంజూరు చేసింది.
కేంద్ర ప్రభుత్వ అనుమతుల తర్వాతే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి 23-06-2023 తర్వాత పర్యావరణ అనుమతులు మాత్రమే మంజూరు చేసింది. దీంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రమేయం ఏమి లేదు. అనుమతుల మంజూరు అంత కేంద్ర పరిధిలో ఉంటుంది.
అయితే ఇథనాల్ ప్యాక్టరీ ఏర్పాటు గురించి రైతులకు తెలిసి ఆందోళన చేశారు. అప్పుడు ఈ అంశం మా దృష్టికి వచ్చింది.
ఎన్నికలకు ముందే రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు వారికి మద్ధతు తెలిపాం. అవసరమైతే పరిశ్రమను పచ్చటి పంట పోలాలు నుంచి తరలిస్తామని అప్పుడు రైతులకు స్పష్టమైన హామినిచ్చాం.
అప్పటి నుంచి పరిశ్రమ నిర్మాణానికి ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు.
ఇంతలోనే ఎన్నికలు రావడం.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది.
ఎన్నికల తర్వాత ఇథనాల్ ప్యాక్టరీ పనులు ఎందుకు ప్రారంభించారో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి.
దీని వెనుక ఎవరు ఉన్నారో రైతులు గ్రహించాలని కోరుతున్నాను.
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరులు తక్కల రమణ రెడ్డి,జంగం వీరేశం సర్పంచ్ దిలావర్పూర్,సత్యం చంద్రకాంత్ (పిఏ), ముత్యంరెడ్డి, ఎలేటి చిన్న నర్సారెడ్డి (సముందర్ పెళ్లి )తో పాటు మరికొంత మంది మహేశ్వర్ రెడ్డి అనుచరులు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసినారు.
29-11-2022 లోనే పీయంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీతో సేల్ డీడ్ చేసుకున్నారు. అప్పుడు మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.ఆయనతో పాటు ఆయన అనుచరులు ఆ తర్వాత బీజేపీ లో చేరారు.
డబ్బులు తీసుకుని ల్యాండ్ ఇప్పించింది మీ అనుచరులే కదా
మీ అనుచరులు భూములు ఇప్పించక పోతే ఇక్కడ ప్యాక్టరీ ఏర్పాటు అయ్యేది కాదు.
ఇథనాల్ ప్యాక్టరీ గుండపల్లి లో ఏర్పాటు చేయడానికి మహేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులే అన్నది వాస్తవం కాదా
చేసిదంతా వాళ్లు చేసి మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు
ప్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి.
పరిశ్రమ రద్దు లేదా తరలింపు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని డిమాండ్ చేస్తున్నం.
ఒకరిపై ఒకరు రాజకీయంగా బురదజల్లు కోవడం మాని.రైతులకు అండగా నిలుద్దామని కోరుతున్నాను.
లేదంటే బీఆర్ఎస్ పార్టీ దీనిపై పోరాటం చేస్తుంది.
పరిశ్రమ నిర్మాణ పనులను నిలిపివేయాలి. రైతులతో చర్చలు జరపాలి.
పచ్చటి పంట పోలాల మధ్య నుంచి పరిశ్రమను తరలించాలి.
అప్పటి వరకు మేము రైతుల వెంట ఉంటాం.