బి.ఆర్.ఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల మనోభావాలు

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 28 మార్చి 2025
మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా పుప్పాలగూడ పరిధి లోని రాఘవేంద్ర నగర్ కాలనీ పరిసర ప్రాంతాలలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తావించిన ప్రధాన సమస్యలలో బెగొనియా గేటెడ్ కమ్యూనిటీ ప్రక్కన గల టెన్నిస్ కోర్ట్ ని ఆనుకొని ఉన్న 15 అడుగుల సి.సి రోడ్ కొంత దూరం పోయిన తర్వాత 3 అడుగులు అన్యాక్రాంతమైన దృష్ట్యా 12 అడుగులకు కుదించుకు పోయింది. ఇదే రోడ్డు చివరన భవల్హ అంతస్తు సముదాయాలు వెలుస్తున్నాయి కావున రాబోయే కాలంలో ఐదంతస్తుల సముదాయాలు అందు బాటులోకి వస్తే ప్రజల రాకపోకలకు రోడ్డులో తీవ్ర అంతరాయం కలిగే ఆస్కారం ఎంతైనా ఉన్నది మరియు ఏవైనా అనుకోని సంఘటనలు జరిగి అత్యవసర వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది అయినా అన్ని విషయాలు తెలిసిన మున్సిపాలిటీ అధికారులు అట్టి భవనాలకు అనుమతు లివ్వడం ఆక్షర్యయముగా ఉన్నదని కావున తక్షణమే స్పందించి ఈ రోడ్డును పరిశీలించి తగు చర్యలు తీసుకోగలరనీ స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ.ఐ.పీ.ఎల్ కార్నర్ స్టోన్ అపార్ట్మెంట్ వెనుక భాగంలో ఉన్న 15 ఫీట్ల మట్టి రోడ్డు సీ.సీ రోడ్డుగా నిర్మించవలసిన అవసరం ఉన్నదనీ స్థానికులు ఎన్ని మార్లు అధికారుల దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టలేదనీ తెలియచేసారు. అల్కాపూర్ పుప్పాలగూడ రోడ్ నెంబర్ 7 లో డ్రైనేజ్ పైప్ లైన్ వేసిన తర్వాత గత 6 నెలలగా రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. సాధారణంగా పైపులైను వేసిన తర్వాత రోడ్డు నిర్మాణం కూడా కాంట్రాక్టు పరిధిలోకి వస్తుంది కానీ మణికొండ మున్సిపాలిటీలో కేవలం గుంతలు తవ్వి పైప్ లైన్లు వేయడం వరకే కాంట్రాక్టర్ ని బాధ్యుణ్ణి చేసిన కారణంగా ఎక్కడ కూడా రోడ్ల నిర్మాణం జరుగుటలేదనీ స్థానికులు పిర్యాదు చేసినారు. అట్లాగే ఎస్.ఎం.ఆర్ అపార్ట్మెంట్ కి 11 కె.వి లైన్ అతి సమీపంగా ఉన్న కారణంగా ప్రమాదం పొంచి ఉన్నది. కావున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ప్రమాదం సంభవించక ముందే అపార్ట్మెంట్ నుంచి ఈ 11 కె.వి లైన్ ని దూరంగా జరపాలి లేకపోతే బంచ్ కేబుల్ వేయ వలసిన అవసరం ఉన్నదనీ తెలిపినారు. పుప్పాలగూడ పైప్ లైన్ మెయిన్ రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ రాఘవేంద్ర కాలనీ మీదిగా విపరీతమైన స్పీడ్గా వెళుతున్న కారణంగా స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు వెంటనే అమర్చాలని వారు కోరుతున్నారు. ఇక్కడ చాలా అపార్ట్మెంట్లకు జలమండలి వారు ఒక నిర్ణీత సమయంలో తగినంత నీరు విడుదల చేయకపోవడం వల్ల స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనీ తెలిపినారు. పైన పేర్కొన్న ప్రతి విషయాన్ని సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయించాలని స్తానిక బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారం ధూళిపాళ నాయకులు గుట్టమీది నరేందర్, గోరుకంటి విఠల్, ఉపేంద్రనాథ్ రెడ్డి, సంగం శ్రీకాంత్, కిరణ్ యాలాల, మాల్యాద్రి నాయుడు, భాను చందర్, సుమనళిని, తిరుపతి, చెరుకూరి బాలాజీ తది తరులు డిమాండ్ చేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking