ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 28:

మందమర్రి పట్టణంలోనీ పలు ముస్లిం కుటుంబాలకు పట్టణ సీఐ కాసర్ల శశిధర్ రెడ్డి చేతుల మీదుగా ముస్లిం తోఫా ను అందించారు. అనంతరం సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ
ముస్లిం సోదరులు ఎంతగానో ఆదరించే అల్లాకు ఈనెల ఎంతో గానో భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటూ భక్తి నీ చాటుకుంటారన్నారు.
ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా వచ్చే ఉగాది పండుగ మరియు రంజాన్ పండుగ కలసి శాంతియుతంగా జరుపుకోవాలన్నారు.
వ్యవస్థాప అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ ప్రజలంతా ముస్లిం హిందూ అన్నదమ్ముల్లాగా పండుగ జరుపుకోవాలనీ అలాగే ఇంతటి మహా కార్యక్రమానికి సహకరించిన బిర్లా టీ.ఎస్. ఎం దాడి రాజు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సేవా వెల్ఫేర్ సొసైటీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్, కార్యదర్శి గండ్ల సంజీవ్ పటేల్, మండల అధ్యక్షుడు సకినాల శంకర్, జావిద్ పాషా, ఎం.డి ఇసాక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking