వక్ఫ్ బోర్డు ఆస్తుల స్వాధీనం కై కేంద్రం కుట్ర

 

-జామతే ఇస్లాం హిందూ వైస్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 28:

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకోవాలని పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించేందుకు సిద్ధంగా ఉన్నదని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్, అధికార ప్రతినిధి, జమాతే ఇస్లాం హిందు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇస్మాయిల్ అన్నారు. శుక్రవారం రెండో జూన్ లో గల మదీనా మజీద్ లో జుమ్మా నమాజ్ తర్వాత తధనంతరం ముస్లింలు అందరు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవాలని మదర్సాలను, మసీదులను, కబ్రా స్థానాలను, దర్గాలను, ఈదగలను స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఇందుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదన చేసేందుకు సిద్దపడిందని ఈ బిల్లును ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తున్నదని అన్నారు. ఈకార్యక్రమంలో కమిటీ సభ్యులు షరీఫ్, యాకూబ్, బషీర్ ఇమామ్సబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking