అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 28 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా: అందోల్ మండలం సంగుపేట శివారులో గురువారం నాడు, రేషన్ బియ్యాన్ని బులోరా వాహనంలో యదేచ్చంగా తరలిస్తున్న దృశ్యాన్ని, అందోల్ (వి6,) విలేకరి అనిల్ చారి, చిత్రీకరిస్తుండగా అక్కడికి బియ్యం మాఫియా గుండాలు, దానిష్ పటేల్, ఎండి షకిల్, పుట్నాల ఆశీమ్ , ఇలియాజ్,అనే వ్యక్తులు అక్కడికి కారులో వచ్చి అందులో ఉన్న లాఠీలతో కక్షపూరితంగా ఇద్దరు విలేకరులపై మూకుమ్మడి దాడి చేశారని, అందులో (సాక్షి టీవీ )జంగం శ్రీనివాస్, ను కర్రలతో విచక్షణ రహితంగా కొట్టడంతో, విలేఖరి ఎడమ చేయి విరిగిపోయిందని, ముఖంపై గాయాలు అయ్యాయని ఈ విషయం ఎక్కడైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరిస్తూ గూండాయిజం చలాయించారని , ఈ ఘటనపై బాధితులు జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఈ ఘటనపై జోగిపేట ఎస్,ఐ, పాండు, దర్యాప్తు చేపట్టి, సాక్షి విలేఖరి పై దాడికి పాల్పడ్డ నిందితులపై కేసు నమోదు చేశామన్నారు, అక్రమ బియ్యం మాఫియా జోగిపేట (సాక్షి, వి6), విలేకరులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఈ దుర్ఘటన జర్నలిజం పై గొడ్డలి పెట్టని, (టీ యూ డబ్ల్యూ జే హెచ్ ) ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, తెంజు ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు యోగానంద రెడ్డి అన్నారు, అనంతరం అందోల్ జర్నలిస్టుల మిత్ర బృందంతో కలిసి, ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంగారెడ్డి డి.ఎస్.పి సత్తయ్య గౌడ్,ను కలిసి, ఫిర్యాదు చేశారు, కర్రలతో దాడి చేసిన వారిపై, అత్యాయత్నం కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని విలేకరుల బృందం వినతిపత్రంలో డిమాండ్ చేశారు, దీనికి డి.ఎస్.పి, సానుకూలంగా స్పందించి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు, ఈ కార్యక్రమంలో జోగిపేట విలేకరులు, పడిగెల భగత్, హెచ్, ప్రదీప్ గౌడ్, సంజీవ్ కుమార్, కాశీనాథ్, శివరత్నం, అనిల్ చారి, దిగంబర్,సందీప్ కుమార్,రాజు,మధు,మాలమహానాడు,జిల్లా అధ్యక్షులు అందోల్ మల్లేశం, దళిత సంఘాల నాయకులు, జంగం మహేష్, మొగులయ్య,కరుణాకర్, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు….